ఉపనిషత్తులకు సజీవ భాష్యం, అవతారవరిష్ఠులు అయిన శ్రీరామకృష్ణులవారి ముఖతాజాలువారిన అమృతకలశమే ఈ కథామృత గ్రంథం. ఆధునిక మానవుడు ఆధ్యాత్మిక విలువలపట్ల విముఖత కల్గి ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితం యొక్క ఆవశ్యకతను గుర్తించలేకున్నాడు. ఫలితంగా నిరంతర ఒత్తిడికి లోనై, దుర్భరమైన వేదనతో జీవితంతో రాజీపడలేక, సతమతమవుతున్నాడు. నిజమైన ఆనందం, ప్రశాంతత ఆధ్యాత్మిక జీవనంలోనే లభిస్తుందని మార్గనిర్దేశం చేస్తుంది ఈ గ్రంథం. కాలానికి, జనుల అవసరాలకు తగిన విధంగా బోధ చేయడమే ఈ కథామృత వైశిష్ట్యం. క్లిష్టమైన ఆధ్యాత్మిక సత్యాలు […]